Tollywood Tv Live..

Note: If Live Stream Not Working Please Download and Install Plugin

కామెడీ సైతాన్‌ వస్తున్నాడు

saithan-raj

వెండి తెరపై ఆ స్టార్‌ కామెడీ యాక్టర్‌ కనిపించగానే థియేటర్లో కిందినుంచి పైదాకా నవ్వులే నవ్వులు. జస్ట్‌ అతని ఫేస్‌ చూస్తే చాలు. ఫక్కుమంటూ నవ్వేస్తారు. ఇంతలా ఫన్నీ కురిపించే ఈ కామెడీ కింగ్‌ ఈ సారి మరో వెరైటీ గెటప్‌లో కనిపించి కనువిందు చెయ్యబోతున్నాడు. అయితే ఇదంతా తమ చిన్న సినిమాని హైప్‌ తీసుకొచ్చేందుకే ఆ నిర్మాత ప్రయత్నం…ఇంతకీ ఆ స్టార్‌ కమెడియన్‌ ఎవరో …అతని సరికొత్త గెటప్‌ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా…అయితే జస్ట్ వాచ్‌…

తెలుగు సినిమాలలో కామెడీలకే ఓ స్టార్‌ డమ్‌ తెచ్చాడు బ్రహ్మానందం. కేవలం అతని కటౌట్‌ కనిపిస్తే చాలు థియేటర్లకు క్యూ కట్టే అభిమానులు కో కొల్లలు. బాధలతో సతమతమయ్యే సగటు ప్రేక్షకులకు అతడొక నవ్వుల నావ. కనీసం అతడిని చూస్తూ…హాయిగా నవ్వుకుంటూ తమ కష్టాలను మర్చిపోతుంటారు. కామెడీయే అతని కింగ్‌డం…అరగుండుగా కనిపించి….ఆ క్యారెక్టర్ నే తన సిగ్నేచర్‌ మూవీగా మలుచుకున్నాడు.

బ్రహ్మానందం పోస్టర్‌పై కనిపిస్తే చాలు సినిమాకు క్యూ కట్టే అభిమానులున్నారు. హీరోతో సమానంగా బ్రహ్మానందం కనిపించగానే చప్పట్లు…నవ్వులు మార్మోగిపోతాయి. ఈ తరం గర్వించదగ్గ హాస్య నటుడు ఆయన. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది. అంతేకాదు అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలలో నటించిన బ్రహ్మానందానికిగిన్నీస్‌ బుక్‌ రికార్డుల్లో స్థానం కూడా కల్పించారు. ఇది తెలుగువారు గర్వించదగిన అంశం…

బ్రహ్మానందం తెరపై కొద్దిసేపు కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులే నవ్వులు. కోన వెంకట్‌ నిర్మాణ సారధ్యంలో వస్తున్న గీతాంజలి మూవీలో బ్రహ్మానందం సైతాన్‌ రాజ్‌గా కనిపించి నవ్వుల వాన కురిపించనున్నాడు. గతంలో వెంకీ మూవీనుంచి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలలో బ్రహ్మానందానికి మంచి పేరు తెచ్చని క్యారెక్టర్లన్నీ కూడా కోన వెంకట్‌ క్రియేట్‌ చేసినవి కావడం గమనార్హం.

నిత్యజీవితంలో బాధలతో సతమతమవుతూ సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు తన బ్రహ్మానందభరిత హాస్యపు జల్లుతో ముంచెత్తే కామెడీ కింగ్‌ బ్రహ్మానందం ఈ సారి సైతాన్‌రాజ్‌గా కనిపించి మరోసారి హాస్యాన్ని పండించాలని కోరుకుందాం…

నవ్వించడమే ఇష్టమంటున్న ప్రిన్స్
aagadu
తెలుగు సినిమా కలెక్షన్ల రికార్డులకు కేరాఫ్‌ అడ్రెస్ అతడు. విభిన్న తరహా క్యారెక్టర్లు వైవిధ్యంగా…తనదైన స్టయిల్‌లో చేసి చూపించే సత్తా ఉన్న నటుడు హీరో మహేష్బాబు. కేవలం ఇరవై చిత్రాలకే రెండు వందల మూవీస్‌ అనుభవాన్ని రంగరించుకుని టాలీవుడ్‌ రాకుమారుడిలా వెలిగిపోతున్నాడు. అయితే అతని రీసెంట్ మూవీ ఆగడు కూడా దూకుడు చిత్రం కన్నా ఎక్కువ ఫన్నీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఇంతకీ ఆ విశేషాలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా…అయితే జస్ట్ వాచ్ దిస్ స్టోరీ…

ఎవ్వరి పేరు చెబితే ఎండ్‌లెస్‌ రికార్డ్స్‌ క్రియేట్‌ అవుతాయో అతడే ప్రిన్స్‌…తెలుగు మూవీ కలెక్షన్ల స్టామినాను ఒక్కసారిగా టర్న్ చేసిన హీరో అతను. ఆ పేరులోనే వైబ్రేషన్‌ ఉంది. అమ్మాయిల హార్ట్స్‌ షేక్‌ అయిపోతాయి. 40 నుంచి 50 కోట్లు ఈజీగా కొల్లగొట్టేసిన మహేష్‌ తీయడానికి బడా ప్రొడ్యూసర్స్‌ క్యూ కడుతున్నారు. ఓవర్‌సీస్‌ మార్కెట్‌ ఇప్పటికీ నెంబర్‌ వన్‌ నేనొక్కడినే అంటున్నాడీ ప్రిన్స్‌….

సంక్రాంతి రేసులో వన్‌ అంటూ దూసుకొచ్చిన ప్రిన్స్‌…వనడర్స్‌ క్రియేట్‌ చేయాలనుకున్నాడు. అయితే నేనొక్కడినే మూవీ కొంతమందిని విపరీతంగా ఆకట్టుకుంది. టాక్‌తో సంబంధం లేకుండానే ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లు సాధించింది. అయితే ఈ మూవీలో ప్రిన్స్‌ నటన హాలీవుడ్‌ తరహాలో కనిపించడం…కొత్త లుక్‌ ట్రై చెయ్యడం….ఈ టైప్ ఆఫ్ మూవీ మన టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తదవడం…వంటి అంశాలతో ప్రిన్స్కి మంచి పేరు తెచ్చిపెట్టింది వన్….మూవీ.

అయితే వన్‌ మూవీ కాస్త నిరాశపరచడంతో…ఇక ప్రయోగాల జోలికి వెళ్లనన్న మహేష్‌బాబు తన లేటెస్ట్‌ మూవీ ఆగడు…ని పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్ టైనర్‌గా చేయాలనుకుంటున్నాడు. శ్రీనువైట్ల కూడా తన గత చిత్రం దూకుడును మించేలా ఫన్నీ సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నాడు. ముఖ్యంగా బ్రహ్మానందం, పోసాని మధ్య వచ్చే హిల్లేరియస్‌ కామెడీ చిత్రానికే హైలెట్‌ అవుతుందంటున్నారు.

ప్రిన్స్ మరిన్ని విజయాలను తన సొంతం చేసుకుని…నెంబర్ వన్ దిశగా అడుగులు వేయాలని…రాబోయే తన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డు సాధించాలని కోరుకుందాం…

 

ప్రభాస్ ను కాపాడిన రమ్య
Prabhas Ramya
సినిమా షూటింగ్స్ లో అప్పుడప్పుడు ప్రమాదకరమైన సీన్లలో యాక్ట్ చేయాల్సి వస్తుంది. ప్రమాదానికి గురైన వాళ్లను యూనిట్ సభ్యులో, సాటి నటులో రక్షిస్తుంటారు. అయితే ఇక్కడ సీన్ వేరు. ఓ సినిమాలో నాటి హీరోయిన్, నేటి హీరోను రక్షిస్తుంది. అసలేం జరిగిందంటే ….

దర్శకుడు రాజమౌళి భారీ ఎత్తున తీస్తున్న బాహుబలి పిక్చర్ లో రాజమాతగా రమ్యకృష్ణ, ఆమె కొడుకుగా ప్రభాస్ నటిస్తున్నారు. కథ ప్రకారం …. రమ్యకృష్ణ రాజమాతగా ఉన్న రాజ్యాన్ని శత్రువులు చుట్టుముడతారు. దాడి చేస్తారు. తన కుమారుడు ప్రభాస్ ను శత్రువుల బారి నుంచి ఎలాగైనా రక్షించుకోవాలి అనుకుంటుంది రమ్యకృష్ణ.

రాజకుమారుడిని రక్షించగలిగితే, రాజ్యాన్ని రక్షించుకున్నట్టే అవుతుంది. ఈ విధంగా ఆలోచించి రమ్యకృష్ణ ఎవరూ చేయని సాహసం చేసింది. శత్రువుల కంట పడకుండా కుమారుడిని దూరంగా తీసుకెళ్లాలనుకుంది.

ఆ పరిస్థితిలో ఓ చోట నదిని దాటాల్సి వస్తుంది. ప్రభాస్ ను తీసుకొని …. ఉరవళ్లు పరవళ్లతో ప్రవహిస్తున్న నదిని దాటుతుంది రమ్యకృష్ణ. కొడుకును సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లిన రాజమాత రమ్యకృష్ణ చివరికి తన ప్రాణాలు పోగొట్టుకుంటుంది.

సన్నివేశాన్ని కేరళలోని ఓ అడవిలో చిత్రీకరించారు. ఎంతో సాహసంతో చేసిన ఈ సీన్ చాలా బాగా వచ్చిందట. ఇలాంటి ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఆ సినిమాలో ఎన్నో ఉన్నాయట.